కవిత

కవిత

నీ రాక కోసం 
ఎదురు చూసీ చూసీ 
నేనలసి పోయాను 
ఎంతలా అంటే 
నన్ను నేను గుర్తు 
పట్టుకోలేనంతగా 
నీ కోసం ఆరాటపడని 
క్షణమే లేదు అయితే 
నువ్వు నేను ఆనందంగా 
ఆహ్లాదంగా ఉన్నపుడే వస్తావు
నన్ను బాధకు గురి చేస్తావు 
అయినప్పటికీ 
నువ్వంటే నాకు ఇష్టమే 
నీ రాక నాలో 
కొత్త ఉత్తేజాన్ని 
ఉద్రేకాన్ని 
నింపుతోంది 
నీలి మేఘాల నుండి 
జాలు వారి నన్ను 
నువ్వు ముద్దాడు సమయంలో 
నేను మైమరచి నిన్ను 
నాలో కలుపుకుంటాను 
నాలో కలిసిన నువ్వు 
నాకు జీవాన్ని పోస్తావు 
నాలో ఉదయించే 
ప్రతి అణువుకు నువ్వే 
సాక్షిభూతమై నిలుస్తావు 
నా నుండి విడివడి 
అందరికీ ప్రాణధారవు అవుతావు 
నీ నుండి పొందిన ప్రేమకు గుర్తుగా 
ఆమని ఋతువునై
కోయిల గొంతులో 
కమ్మని కావ్యంగా పాడుతాను 
నిన్ను పొందిన ఆనందంలో 
పురిటి నొప్పులు పడకుండా 
ప్రసవ వేదనను అనుభవించి 
ప్రకృతి అనే మాధుర్యాన్ని 
అందరికీ పంచుతూ
నీ అవనినై 
నీ రాకకై 
నిరీక్షిస్తూ ................

No comments:

Post a Comment