చిన్నారి

చిన్నారి

చిన్నారి నా తండ్రి 
నా ఒడిన ఆడరా !
నీ చిన్ని మాటలతో 
అమ్మా ! అని పిలవవా !
బంగారు నీ నోట 
అమ్మా అను మాట 
తీయని గానమై 
నను చేరు వేళ 
ఏ నోము నోచానో 
నీకమ్మనైనాను 
ఏ పూజ చేసానో 
ఈ వరము పొందాను
నీ కంట కన్నీరు 
నే చూడగలనా ! 
నువు లేక నేను 
జీవించగలనా ! 
నా ఒడిన చేరి నను 
అలరించ రారా ! 
ఈ అమ్మ హృదయాన్ని 
మురిపించ రావా !




No comments:

Post a Comment