అమ్మా అని పిలవాలని

అమ్మా అని పిలవాలని
ప్రేమిస్తే నీలాగే ప్రేమిచాలి 
ఎందుకంటే 
నీ ప్రేమ స్వార్థ రహితమైనది 
ప్రేమిస్తే నీలాగే ఉండాలి 
ఎందుకంటే 
నీ ప్రేమకు అవధులు ఉండవు 
ప్రేమిస్తే నీలాగే మట్లాడాలి 
ఎందుకంటే 
నీ ప్రతి మాటలో నా పై ప్రేమ మాత్రమే ఉంటుంది 
నీ చేతి స్పర్శతో నన్ను 
ఈ లోకంలో మాయ చేసి 
నిద్రింపజేస్తావు 
నా పెదవులతో 
నీ పేరు పలికిన ప్రతీ సారి 
నీ కళ్ళలో ఎంతో 
ఆనందాన్ని చూపుతావు 
నీ ఒడిలో నన్ను చేర్చి 
నీ తీయని రాగంతో 
నాకు గోరు ముద్దలు తినిపిస్తావు 
నువ్వు నా నుదుటిపై వాలి 
నన్ను ముద్దాడిన వేళ 
ప్రతి జన్మలో నువ్వే 
నాకు తోడుగా ఉండాలి 
ఎన్ని జన్మలలో అయినా 
నీ ప్రేమ నేను మాత్రమే పొందాలి  
నాకు చిన్న కష్టం వచ్చినా 
అహో రాత్రులూ 
నా కోసం నీ కన్నులనే 
దీపాలుగా చేసి ఆరాటపడతావు 
నిన్ను నువ్వు మరచిన 
క్షణం ఉంటుందేమో కానీ 
నన్ను మరచిన క్షణం 
లేదని నాకు తెలుసు 
నా కోసం నువ్వు 
ఏ త్యాగమైనా చేయగలవు 
నీ ప్రాణాలను సైతం 
అవలీలగా ఇవ్వగలవు 
ఈ సృష్టిలో నన్ను 
నువ్వు ప్రేమించినంతగా 
ఎవ్వరూ నన్ను ప్రేమించరూ 
ప్రేమించలేరు 
నిన్ను విడచి 
నువ్వు ఉండగలవు 
గానీ నన్ను మాత్రం 
నీ మరణం చివర కూడా 
వదలలేక ఉండిపోతావు 
ఎందుకు 
ఇంతలా నీ నుండి 
ప్రేమను పొందిన 
నేను మాత్రం 
నీ ప్రేమను గుర్తించలేక 
అనాథలా మిగిలిపోయాను 
నీ చివరి క్షణం లో కూడా 
నీ ప్రేమను గుర్తించలేదు 
నువ్వే లేకపొతే నేనసలు 
ఉండేవాడిని కాదని 
తెలుసుకోలేక నాకు 
నువ్వే అన్నీ అని తెలుసుకోలేక 
నన్ను గుడ్డి వాడిని చేస్తుంది 
నాలోని స్వార్థం చివరికి 
ఇన్ని తెలుసుకున్న నేను 
నీతో హాయిగా జీవించాలనుకున్న 
క్షణములో నువ్వు నా పక్కన 
లేవనే బాధను భరించలేక  
నీ నుంచి పొందే 
మరొక వరం మరుజన్మకు 
కూడా నేను నీకు బిడ్డగా 
పుట్టాలని నిన్ను నేను 
అమ్మా అని పిలవాలని

No comments:

Post a Comment